Hyderabad Gunfire: హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట్ సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. దీనిపై పోలీసులకి బాధితుడు సిద్దార్థ్ దాస్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలుగు సీరియల్ నటుడు మనోజ్ సెలబ్రిటీ క్లబ్ రిసార్ట్స్‌లో ఒక విల్లాలో సిద్దార్థ అనే వ్యక్తి భార్యతో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
వివాహేతర సంబంధమే..(Hyderabad Gunfire)
ఈ సందర్భంగా సిద్దార్డ, మనోజ్ ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నటుడు మనోజ్ తన ప్రియురాలి భర్త సిద్దార్థ్‌పై కాల్పులు జరిపాడని పోలీసులు గుర్తించారు. కాల్పులనుంచి తప్పించుకున్న సిద్దార్థ్ దాస్ పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు గుర్తించారు. కాగా మనోజ్ కార్తీకదీపం, మౌనపోరాటం సీరియళ్లలో నటించాడు.
పోలీసుల విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయి. సిద్దార్థ్, ప్రియ భార్యాభర్తలు. ఇద్దరూ మనస్పర్థల కారణంగా 2019లో విడిపోయారు. స్మిత సీరియళ్ళ నటుడు మనోజ్ నాయుడితో కలిసి సెలబ్రిటీ రిసార్ట్స్ లో నివసిస్తున్నారు. ఇటీవల స్మిత కుమారుడు సీరియళ్ళ నటుడు మనోజ్ వేధిస్తున్నాడంటూ సిడబ్ల్యుసికి ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేపట్టిన సిడబ్ల్యుసి అధికారులు ఆ బాలుడిని సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన సిద్దార్థ్ తన కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని సెలబ్రిటీ విల్లాస్‌కి వచ్చాడు. ఈ క్రమంలో మాజీ భార్య స్మితతో సిద్దార్థ్‌కి వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో రెచ్చిపోయిన మనోజ్ తన దగ్గరున్న ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు.