Amaravati R5 zone: అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. R5 జోన్‌పై రైతుల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. R5 జోన్ లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించటంపై జారీ చేసిన జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు పిటిషన్ వేశారు. అయితే.. జీవో నెంబర్ 45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోని పేదలకైనా అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం R5 పేరుతో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా నుంచి 550.65 ఎకరాల భూమిని, ఎన్టీఆర్ జిల్లా నుంచి 583.93 ఎకరాల భూమిని సీఆర్‌డీఏ కమిషనర్‌కు బదిలీ చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 45ను ఆర్5 జోన్ కోసంతీసుకొచ్చింది.
ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జీవో నెం.45ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది. అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అమరావతి భూములను సీఆర్‌డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని కోరారు. ఈ క్రమంలో కోర్టు దిగ్భ్రాంతి చెంది పిటిషన్‌ను కొట్టివేసింది. కోర్టు తీర్పుకు లోబడి ఇళ్ల పట్టాల పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమరావతి రైతులు సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నారు.
పేదలకు ఆర్ 5 జోన్ లో ఇళ్లు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం గతంలో జీఓ నెం.45 జారీ చేసింది. అయితే జీవో నెం.45ని రద్దు చేయాలంటూ రైతులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని రైతులు చెబుతున్నారు.
https://youtu.be/j77nLfnYwLI