Site icon Prime9

Gram Secretariat : ఏపీలో గ్రామసచివాలయ వ్యవస్దకు చట్టభధ్రత.. ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కార్

Gram Secretariat

Gram Secretariat

Gram Secretariat : ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకువచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించి ఆర్డినెన్స్‌ను జారీ చేసిటనట్లు వెల్లడించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ చట్టం తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కూడా ప్రత్యేక చట్టం రూపంలోకి వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూల్ ప్రకారం.. చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది.

ఏపీలో 2 అక్టోబర్‌ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్తగా 1.34 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టి.. ఒక్కో సచివాలయానికి 10 నుంచి`11 మంది ఉద్యోగులను ఏర్పాటు చేసింది. కే వీటి ద్వారా 545 రకాల సేవలను ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే పొందుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సబంధించి చట్టాన్ని తీసుకువస్తూ ఆర్ధినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది. సభ్యుల ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. దీంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలె గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ప్రొబెషన్ పూర్తి చేసిన ఉద్యోగులకు వారి జీతాలు పెంచడంతోపాటు వారిని ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్‌ కార్డుల జారీ చేసేందుకు రెడీ అవుతోంది. అదేవిధంగా ప్రొబెషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కారుణ్య నియామకాలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Exit mobile version