GHMC: హైదరాబాద్ నగరంలో అనధికారిక ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) గతంలోనే స్పష్టం చేసింది. అయినా సరే వివిధ కార్యక్రమాల సందర్బంగా పలువురు వీటిని పెడుతున్నారు. ఇటువంటి వారిపై జిహెచ్ఎంసి కొరడా ఝలిపిస్తోంది. హోదాతో సంబంధం లేకుండా జరిమానాలు విధిస్తోంది.
తాజాగా ట్యాంక్ బండ్ రోడ్ వద్ద అనధికారిక ప్రకటనలను పెట్టినందుకు గాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పశుసంవర్ధక శాఖ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ కు జరిమానా విధించింది.మంత్రికి రూ.15,000 జరిమానా విధించారు.అదే సమయంలో, నారాయణగూడలో అనధికారిక ప్రకటనలను పెట్టినందుకు కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్‌పై కూడా రూ.10,000 జరిమానా విధించబడింది.ఈ సమస్యలను ట్విట్టర్ ద్వారా జిహెచ్ఎంసి యొక్క సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ దృష్టికి తీసుకురావడంతో జరిమానాలు విధించారు.