Gadwala MLA Bandla Krishnamohan Reddy: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు పేర్కొంది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. అందులోనుంచి యాభై వేల రూపాయలని డికె అరుణకివ్వాలని కోర్టు ఆదేశించింది.
కృష్ణమోహన్ తన ఆస్తులకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్‌లో సమర్పించారని ఆరోపిస్తూ డీకే అరుణ తన మేనల్లుడుపై హైకోర్టును ఆశ్రయించారు. యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించినా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆస్తులు అమ్ముకున్నారని ఆరోపించారు. అంతేకాదు రాండమ్ చెకింగ్‌లో భాగంగా VVPAT ప్రింటెడ్ స్లిప్‌లను లెక్కించినప్పుడు, EVM ద్వారా భద్రపరచబడిన ఓట్లు మరియు VVPATల ముద్రించిన స్లిప్పుల పరంగా తేడాలు ఉన్నట్లు డీకే అరుణ ఎన్నికల ఏజెంట్ గమనించారు. వీటన్నింటిపై డీకే అరుణ పిటిషన్ దాఖలు చేసారు.
అరుణ 2004, 2009 మరియు 2014లో కాంగ్రెస్ నుండి గద్వాల్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, ఆమె మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో, ఆమె కాంగ్రెస్‌ను విడిచిపెట్టి, 2019లో బిజెపిలో చేరి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు అయ్యారు.