Revanth Reddy:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో మైనార్టీ డిక్లరేషన్‌ను విడుదల చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తుల డిజిటలైజేషన్ ..(Revanth Reddy)
ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. ఇమామ్‌లు, మ్యూజిన్‌లు, ఖాదీమ్‌లు, పాస్టర్లలతో సహా అన్ని మతాల పూజారులకు నెలవారీ గౌరవ వేతనం రూ.10 వేలు-12 వేలు ఇస్తామని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూమి, ఆస్తి రికార్డులను డిజిటలైజ్ చేస్తామన్నారు. కొత్తగా పెళ్లైన జంటకు రూ.లక్షా 60 వేలు అందిస్తామని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి కేటాయింపు చేస్తామని తెలిపారు. ఇల్లు లేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి రూ.5 లక్షలు రుణంగా అందజేస్తామని చెప్పారు.కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో కూడా మైనారిటీలకు రిజర్వుషన్లు కల్నించిన ఘనత కాంగ్రెస్ దేనని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్దులకు మద్దతుగా మైనారిటీ సోదరులు నిలవాలని రేవంత్ రెడ్డి కోరారు.