Site icon Prime9

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy Arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఈవీఎంల ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి కేసులో పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.

ఈవీఎం ధ్వంసం (Pinnelli Ramakrishna Reddy Arrest)

మే 13న పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ స్టేషన్‌లో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారు. పోలింగ్ కేంద్రంలో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. ఆ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం ఈ వీడియోలో కనిపించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణిచింది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్టును ఈసీకి పింపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫారసు చేయాలని ఈసీ ఆదేశించింది.

ఈవీఎం ధ్వంసంతో పాటు.. మరో మూడు కేసులు పిన్నెల్లిపై నమోదయ్యాయి. నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయి‌ల్‌పై.. సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. ఇవాళ తీర్పు వెలువరింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. నాలుగు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు తిరస్కరించింది.

ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి తరలింపు | Pinnelli Ramakrishna Reddy Arrest | Prime9 News

Exit mobile version
Skip to toolbar