Site icon Prime9

Jayasudha: బీజేపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ

Jayasudha

Jayasudha

Jayasudha: సినీ నటి జయసుధ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.

అభివృద్దిని చూసి..( Jayasudha)

ఈ సందర్బంగా జయసుధ మాట్లాడుతుూ తొమ్మిదేళ్ల మోదీ నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ది చూసి ఆకర్షితురాలినై బీజేపీలో చేరారని అన్నారు. మార్పు కోసం బీజేపీలో చేరినట్టు తెలిపిన జయసుధ సినిమాలకంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు పేదలకు మంచిచేయాలి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో బీజేపీలో చేరానని ఆమె తెలిపారు.

తెలంగాణ వార్ రూమ్ ఏర్పాటు..

ఇలాఉండగా బీజేపీ అధిష్టానం ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ వార్ రూమ్ ఏర్పాటు చేసింది. పార్టీ లైన్ దాటితే ఇకపై ఢిల్లీనుంచి వార్నింగ్‌లు తప్పవని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని నేతలని అధిష్టానం ఆదేశించింది. తక్కువ మాట్లాడాలని.. ఎక్కువ పనిచేయాలని సూచించింది. కిషన్ రెడ్డి ఇంట్లో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీకి టార్గెట్ ఫిక్స్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెలవాలంటూ హుకుం జారీ చేశారు.

ఎంత పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని అమిత్ షా తేల్చి చెప్పేశారు. కిషన్‌రెడ్డితో సహా ముఖ్యనేతలంతా అసెంబ్లీ బరిలోకే వెళ్ళాలని అమిత్ షా స్పష్టం చేశారు. 25 నుంచి 35 మంది టాప్ లీడర్లను గుర్తించాలని సూచించారు. సాంప్రాదాయిక బిజెపి రాజకీయాన్ని పక్కన పెట్టాలని కొత్త తరహా రాజకీయంతో ముందుకు వెళ్ళాలని అమిత్ షా డైరక్షన్ ఇచ్చారు. ఢిల్లీలో ఉండ వద్దని, ఎవరైనా గల్లీలోనే ఉండాలని ఆదేశించారు. తెలంగాణ బిజెపికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీనుంచే జరుగుతాయని అమిత్ షా తేల్చి చెప్పారు.

Exit mobile version