Chandrababu Naidu: రాజమండ్రి జైలులో చంద్రబాబుతో కుటుంబసభ్యులు ములాఖత్ అయ్యారు. . చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, బావమరిది రామకృష్ణ తదితరులు చంద్రబాబును కలిసారు. జైలులో చంద్రబాబుకు అందుతున్న సౌకర్యాలు, ఆరోగ్యంపై ఆరా తీసారు. దాదాపు 40 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు.
ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించేవారు..( Chandrababu Naidu)
అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారని చెప్పారు. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అనేవారని.. ప్రజల హక్కుల కోసమే చంద్రబాబు పోరాటం చేస్తున్నారని అన్నారు. నాకు ప్రజలు ముఖ్యం. తరువాతే కుటుంబం అనేవారు. అటువంటిది చంద్రబాబు కట్టిన జైల్లోనే ఆయన్ని కట్టిపడేశారు. మీకోసం పోరాడిన వ్యక్తిని ఇటువంటి తప్పుడు కేసులో ఇరికించినందుకు ప్రజలు బయటకు వచ్చి పోరాడాలి. చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని భువనేశ్వరి అన్నారు.