Ex-DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధనకోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
ఆధ్యాత్మిక మార్గంలో..(Ex-DSP Nalini)
నళినికి తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ సూచించారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తనకి ఉద్యోగం అవసరం లేదని, ఆర్థిక సాయం చేయమని సిఎంని నళిని కోరారు.ముఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది, ప్రస్తుతం నాకు ఉద్యోగం అవసరం లేదు. నేను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను . వేద కేంద్రాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి మద్దతు కోరాను అని నళిని చెప్పారు. త్వరలో ఆధ్యాత్మికతపై పుస్తకాలను తెస్తానని చెప్పారు.