TTD EO Shyamala Rao: ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో స్పష్టం చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు .5 హామీలపై అమలుపై స్పష్టమైన ప్రణాళికతో, వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు .ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలి, ప్రణాళిక ఉండాలి…..నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదు అని అధికారులకు ఆదేశాలు జారీచేశారు .పాలనపై కొత్త ప్రభుత్వం మార్క్ ఉండాలి…..మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చెప్పారు .
టీటీడీ తోనే ప్రక్షాళన..(TTD EO Shyamala Rao)
ముందుగా అనుకున్నట్లుగా టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టారు చంద్రబాబు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డిని తప్పించి కొత్త ఈవో గా సీనియర్ ఐఎఎస్ శ్యామలరావు కు పోస్టింగ్ ఇచ్చారు .
అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సిఎం కసరత్తు చేస్తున్నారు .నేడు సిఎంవో, సిఎస్, డిజిపిలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు .ఈ సందర్భంగా సమర్థులైన అధికారులకు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్ లు ఇవ్వనున్నారు . వైసీపీతో అంటకాగిన వారిని, జగన్ కు ఏజెంట్లుగా పనిచేసిన వారి ని దూరంగా పెట్టనున్నట్లు తెలుస్తోంది .మరోవైపు పార్టీకీ, క్యాడర్ కూ సమయం ఇచ్చేలా ప్రణాళిక సిద్దంచేసుకుంటున్నారు .శనివారం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు సందర్చించనున్నారు .ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే సూచనలు చేసారు .
అన్న క్యాంటీన్లు పునః ప్రారంభం..
చంద్రబాబు సీఎం గా తొలి రోజు సంతకం పెట్టిన ఫైల్స్‌లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఒకటి. ఆయా ప్రాంతాల్లో వంద రోజల్లో క్యాంటీన్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అధికారులకు సెప్టెంబర్ 21వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. ఇందులో మున్సిపల్ కమిషనర్లతోపాటు, పబ్లిక్‌హెల్త్, అర్బన్ ప్లానింగ్ విభాగం అధికారులను కూడా భాగం చేశారు. గతంలో మాదిరిగానే భవనాల డిజైన్లు ఉండాలని గతంలో నిర్మించిన ఎంత వరకు ఉపయోగకరమో చూడాలన్నారు. ఇవాల్టి నుంచే చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.మొదటి రోజు పాత భవనాలను పరిశీలించి అక్కడ పరిస్థితిపై నివేదిక రూపొందించాలి. ప్రకటించిన కార్యాచరణ ప్రకారం జూన్ 19న పాత భవనాల పునరుద్ధరణకు, కొత్త భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి. 30న కొత్త భవనాలన నిర్మానానికి స్థల సేకరణ చేపట్టాలి. ఖాళీ భవనాలు ఉంటే ఎంపిక చేయాలి. జులై 30న క్యాంటీన్లలో భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఎంపిక చేయాలి. ఆగస్టు 10 న ఎంపిక చేసిన వారికి పనులు అప్పగించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. 15న సంస్థలతో అగ్రిమెంట్ చేసుకోవాలి. సెప్టెంబర్ 21లోపు 203 క్యాంటీన్లు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసారు.