Prime9

Tirumala: తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీ

 Tirumala: తిరుమలలో గుర్తు తెలియని దుండగులు ఉచిత ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేశారు. తిరుమల గ్యారేజ్ నుండి చోరీ చేసి అందులోనే చక్కర్లు కొట్టారు. జిపిఆర్ఎస్ సిస్టం ద్వారాబస్సును గుర్తించిన పోలీసులు లోకేషన్ ద్వారా ట్రేస్ చేసి బస్‌ను స్వాధీనం చేసుకున్నారు. దుండగులు తెచ్చుకున్న కారును కూడా వదిలేసి పారిపోయారు. పరారీలో ఉన్న దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

బస్సు విలువ.. రూ.2 కోట్లు..( Tirumala)

తిరుమలలో యాత్రికుల ఉచిత రవాణా కోసం టిటిడి ఉచిత బస్సు శ్రీవారి ధర్మరథం  అదృశ్యమయింది. డ్రైవర్ ఎప్పటిలాగే ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు రీఛార్జ్ కోసం కొండలపై ఉన్న జిఎన్‌సి టోల్ గేట్ వద్ద ఉన్న ఛార్జింగ్ పాయింట్ వద్దకు వెళ్లి ఎలక్ట్రిక్ బస్సు కనిపించక షాక్‌కు గురయ్యాడు. ఇతర ఉద్యోగులతో కలిసి బస్సు కోసం వెతికి కనిపించకపోవడంతో సంబంధిత అధికారికి ఫిర్యాదు చేశాడు, అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఎలక్ట్రిక్ బస్సు మిస్సింగ్‌పై కేసు నమోదు చేసి తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ బస్సు విలువ రూ. 2 కోట్లు. అన్ని జిల్లాలకు పోలీసులు హెచ్చరిక పంపారు. ఇలా ఉండగా పోలీసులు బస్సు ఆపుతున్నారని తెలుసుకొని బస్సును నాయుడు పేట వద్ద వదిలేసి దుండగులు పరారయ్యారు.

 

తిరుమలలో  ఎలక్ట్రిక్ బస్సును చోరీ చేసిన దుండగులు | Electric Bus | Tirumala | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar