Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. మే13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాత నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధుల విడుదలపై ఎన్నికల సంఘానికి ఎన్. వేణుగోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దీనిపై ఎన్నికల సంఘం రైతు భరోసా చెల్లింపులను వాయిదా వేయాలని పేర్కొంది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని.. ( Rythu Bharosa)
ఐదు ఎకరాలు పైబడి ఉన్న రైతులకు రైతు భరోసా నిధుల చెల్లింపులను ప్రభుత్వం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ మేరకు మే 4న ప్రభుత్వం జీవో జారీ చేసి రూ. 15,246 మంది రైతులకు 15,814.03 ఎకరాలకు ఎకరాకు 10,000 చొప్పున పంపిణీ చేసింది. మిగిలిన వారికి మంగళవారం చెల్లింపులు జరిగాయి.అయితే ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వుల మేరకు రైతు భరోసా చెల్లింపులను నిలిపివేయవలసి ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మే 9 నాటికి రైతు భరోసా చెల్లింపులను పూర్తి చేస్తామని చెప్పారు. సీఎం వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు ఉన్నాయని వేణుగోపాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది.