Site icon Prime9

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి ఈడీ సమన్లు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi Liquor Scam: తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. దీంతో కవిత ఈడీ విచారణ కీలకంగా మారింది.

అప్రూవర్ గా మారిన అరుణ్ పిళ్లై..(Delhi Liquor Scam)

మరోవైపు అరుణ్ రామచంద్ర పిళ్లై నిన్ననే లిక్కర్ కేసులో అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. తాను కవిత బినామీనని గతంలో చెప్పారు అరుణ్ పిళ్లై. కాగా ఇప్పటికే లిక్కర్ కేసులో ఆరుగురు నిందితులు అప్రూవర్లుగా మారారు. లిక్కర్ కేసులో మార్చి 16,20,21 తేదీల్లో కవితను ప్రశ్నించింది ఈడీ. పిళ్లై అప్రూవర్‌గా మారిన ఒక రోజు తర్వాత కవితకు ఈడీ నోటీసులు రావడం గమనార్హం. ఈ స్కామ్‌లో భాగంగా సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్లు విజయ్ నాయర్ ఖాతాలోకి వెళ్లాయని, ఆయన ఆ డబ్బులను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందజేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనితో.. ఆ సంస్థలో ఉన్న శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా పలువురు ఉన్నారని, ఈ కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది.

 

Exit mobile version