Site icon Prime9

ED searches: హైదరాబాద్‌లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు

ED searches

ED searches

ED searches: హైదరాబాద్‌లోని వైద్య కళాశాలల్లో రెండవ రోజు ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్,మేడ్చల్ , రంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 10 మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఓవైసీ హాస్పిటల్‌లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

సీట్ల భర్తీలో హవాలా లావాదేవీలు..( ED searches)

మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీతోపాటు.. బొమ్మకల్ చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో తనిఖీలు జరుగుతున్నాయి. కామినేని, ఎస్వీఎస్, ప్రతిమతో పాటు 6 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లు, మేడ్చల్‌లోని మెడిసిటీ మెడికల్ కాలేజీలు, సంగారెడ్డి ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో అవకతవకలపై విచారిస్తున్నారు. సీట్ల భర్తీలో భారీగా హవాలా లావాదేవీలు జరిగాయని ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేస్తోంది.

 

రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో రెండో రోజు ఈడీ సోదాలు | ED Raids | Hyderabad | Prime9 News

Exit mobile version
Skip to toolbar