MLA Mahipal Reddy: హైదరాబాద్‌లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి ఇళ్లల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. తెల్లవారుజామునే ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు మహిపాల్‌రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు.
మూడు చోట్ల ఏకకాలంలో..(MLA Mahipal Reddy)
మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా..ఇటీవల ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయ్యారు. గతంలో లక్షారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు మధుసూధన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. లక్డారంలోని గ్రానైట్స్ లో 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించారు మధుసూధన్ రెడ్డి. ఇదే కేసులో మధుసూధన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు.