Site icon Prime9

EC on Postal Ballot: పోస్టల్ బ్యాలెట్ పై ఈసీ కీలక ఆదేశాలు

Postal Ballot

Postal Ballot

EC on Postal Ballot: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లు చెల్లుబాటు విషయంలో రాజకీయ పార్టీలకు ఊరట లభించింది. పోస్టల్ బ్యాలట్ విషయంలో ఏపీలో ఎన్నికల అయిపోయిన తరవాత నుంచి రకరకాల ఊహాగానాలు తెరమీదకి వచ్చాయి .ఏమాత్రం సరిగా లేకపోయినా బ్యాలట్ పేపర్ ను తిరస్కరిస్తారనే విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది .చిన్న పొరపాటు జరిగిన తిరస్కరణకు గురవుతామనే ప్రచారంతో కూటమి చాలా కంగారు పడింది .పోస్టల్ బ్యాలట్ ఓట్లు వేసేది ప్రభుత్వ ఉద్యోగులే .దింతో ప్రభుత్వం మీద వున్నా వ్యతిరేకతతో వాళ్లంతా కూటమికే వేశారనే భావన వుంది.తాజాగా ఈసీ నిర్ణయంతో కూటమి అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నట్లైంది . బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా.. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

సంతకం ,సీల్ అనేది భాద్యత అంతే..(EC on Postal Ballot)

పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై కూడా గెజిటెడ్ అధికారి సంతకం ఉన్నా సీల్ లేదని బ్యాలెట్ చెల్లదని చెప్పకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటరు తమ బ్యాలెట్ పేపర్ లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఏపీలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ఆదేశాలు చేశారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్ వైజర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. అవసరమైతే శిక్షణా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ ఆయన బాధ్యత అని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఫెసిలిటేషన్ సెంటర్ గెజిటెడ్ అధికారి సంతకం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారులు బాధ్యత అని గుర్తు చేసింది.ఈ కారణాలు చెప్పి బ్యాలట్ ను తిరస్కరించడం సరైంది కాదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది .

 

Exit mobile version