Site icon Prime9

Nagababu Comments: వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు: నాగబాబు

Nagababu

Nagababu

Nagababu Comments:  ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని నాగబాబు అనుమానం వ్యక్తం చేశారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో కూటమి నాయకులూ ,కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేసారు .

సంయమనం పాటిద్దాం.. (Nagababu Comments)

వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది… ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దాం… వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు… మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం… కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది’ అంటూ.. Xలో నాగబాబు వీడియో రిలీజ్ చేశారు.

Exit mobile version