Dokka Manikyavaraprasad: ఎన్నికల వేళ గుంటూరు జిల్లా వైసీపీ కి షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన ఆ సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీ క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను సీఎం జగన్‌కు పంపారు.
తాజాగా జరగబోయే ఎన్నికల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ తాడికొండ టికెట్‌ను ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకు వైసీపీ అవకాశం కల్పించింది. దీంతో గతకొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న డొక్కా..ఏప్రిల్ 26 రాజీనామా చేశారు.డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ తో మొదలైంది .2004 ,2009 శాసనసభ ఎన్నికల్లో తాడికొండ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజయం సాధించారు .2009 నుంచి 2011 వరకు మంత్రిగా పనిచేసారు .2014 లో రాష్ట్రం విడిపోయిన తర్వాత డొక్కా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు .తన రాజకీయ గురువు రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ లో చేరడంతో డొక్కా కూడా 2014 ఎన్నికలనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు .
తెలుగుదేశం పార్టీ డొక్కా మాణిక్యవరప్రసాద్ కు ఎమ్మెల్సీ గా అవకాశం వచ్చింది .జగన్ మూడు రాజధానులు ప్రకటించిన సమయంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ కి రాజీనామా చేసారు .జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన డొక్కా వైసీపీలోచేరారు .నాటి నుంచి వైసీపీ లోనే కొనసాగుతున్నారు .తాజాగా తాడికొండ టికెట్ ఆశించి భంగపడ్డారు .దింతో మనస్తాపానికి గురైన డొక్కా వైసిపిని వీడారు .2004 లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు పై రాసిన ‘మనసులోని మాట ‘ పుస్తకంలోని అంశాలను అసెంబ్లీ లో ప్రస్తావించి అందరి దృష్టిని ఆకర్షించారు .నాటి నుంచి వైఎస్ కు బాగా దగ్గరయ్యారు .వైఎస్ ,రోశయ్య మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసారు .లా చదివిన డొక్కా కొంతకాలం సౌత్ సెంట్రల్ రైల్వే లో లీగల్ ఆఫీసర్ గా పనిచేసారు .