Site icon Prime9

Hyderabad ACB Raids: ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఎస్పీ గోనె సందీప్ రావు డాక్యుమెంట్లు

Hyderabad ACB Raids

Hyderabad ACB Raids

Hyderabad ACB Raids: సస్పెండ్ అయిన ఏసిపి ఉమామహేశ్వరరావు నివాసంలో ఏసీబీ సోదాల్లో ట్విస్టు చోటు చేసుకుంది.  ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా ఎస్పీ గోనే సందీప్ రావుకు చెందిన డాక్యుమెంట్లు లభించాయి. ఎస్పీ సందీప్ డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న సీసీఎస్ ఏసీపీ  ఇంట్లో తెల్లవారు జాము నుంచి ACB బృందాలు సోదాలు చేస్తుండగా.. కొద్దిసేపటి క్రితం సోదాల్లో ఎస్పీ డాక్యుమెంట్లు బయటపడడం సంచలనం సృష్టించాయి.

బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు..(Hyderabad ACB Raids)

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడంతో.. అశోక్ నగర్‎లోని ఇంట్లో సోదాలు చేపట్టారు. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు. డబుల్ మర్డర్ కేసులోనూ నిందితుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక ఆధారాలు దొరకడంతో ఉమామహేశ్వరరావును అప్పటి సీపీ సస్పెండ్ చేశారు.

హైదరాబాద్ అశోక్ నగర్ లోని అశోక అపార్ట్ మెంట్లోని మూడు ఫ్లాట్లలో సోదాలు జరుగుతున్నాయి. ఫ్లాట్ నెంబర్ 305లో ఉన్న ఉమామహేశ్వర కూతురు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణాధికారిగా ఉన్నారు. దీనితో సీసీఎస్  కార్యాలయంలో ఉమామహేశ్వరావు క్యాబిన్ ను కూడా సోదా చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం, భీమవరంలోని బంధువులు ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఉమామహేశ్వరరావుతో సన్నిహిత సంబంధాలున్న ఆయన ఇద్దరు స్నేహితులు ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

రౌడీ పోలీస్..దొంగలకే దొంగ | CCS ACP Uma Maheshwar Rao Illegal Scams | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar