Pawan Kalyan in Uppada: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు 3వ రోజు పిఠాపురంలో పర్యటించారు. ఉప్పాడ కొత్తపల్లిలో తీరం వద్ద కోతకు గురవుతున్న ప్రాంతాలను పరిశీలించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పవన్‌కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులో అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చెరువులను పరిశీలించిన పవన్ ..( Pawan Kalyan in Uppada)
ఉప్పాడ సముద్ర తీరానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ స్థానికులతో మాటామంతి నిర్వహించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రత్యమ్నాయ మార్గాలు చూపాలని అధికారులకు ఆదేశించారు. 8 గ్రామాలు సముద్రం కోతకు గురయ్యాయని, రెండు గ్రామాలు అయితే పూర్తి గా మునిగిపోయాయని అధికారులు వివరించారు. కోతకు గురవుతున్న తీరును అధికారులు పవన్ కు ఫొటో ప్రదర్శన ద్వారా వివరించారు.పవన్ రాకతో కోలాహలంగా ఉప్పాడ తీరం కోలాహలంగా మారింది. పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. అనంతరం యు. కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సీపీడబ్ల్యూ హెడ్ వర్క్స్ మంచినీ ట్యాంకును, సూరప్ప చెరువును పవన్ కళ్యాణ్ సందర్శించారు. సూరప్ప చెరువు దగ్గర ఉన్న 7ఎంఎల్డీ సెండ్ ఫిల్టరేషన్, పవర్ హౌస్, ఇతర ల్యాబ్ లను కూడా ఆయన పరిశీలించారు.
కాన్వాయ్ ఆపి బాలుడిని పట్టుకున్న పవన్..
ఓ బాలుడు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఇంటి ముందు నిలబడి జనసేన పార్టీ జంఢాను ఊపుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఆయన కారును ఆపి ఆ బాలుడుని ఆలింగనం చేసుకున్నాడు. కోతకు గురైన ఉప్పాడ తీరం పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకోవడంపై బాలుడు సంతోషం వ్యక్తం చేశారు.