Site icon Prime9

Deputy CM PaWan Kalyan: నిధుల మళ్లింపుపై అధికారులను నిలదీసిన డిప్యూటీ సీఎం వవన్ కళ్యాణ్

pawan kalyan

pawan kalyan

Deputy CM PaWan Kalyan: పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పంచాయతీలు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపుపై పవన్ నిలదీశారు.

సీజనల్ వ్యాధుల కట్టడికి యాక్షన్ ప్లాన్..(Deputy CM PaWan Kalyan)

స్థానిక సంస్థలకు నిధులు ఎందుకివ్వలేదంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎన్ని నిధులు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిధుల మళ్లింపుపై పవన్ కళ్యాణ్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమిలారు. మరోవైపు సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలో తాగునీటి సరఫరాలో లోపాలే..డయేరియాకు దారి తీసిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Exit mobile version