Site icon Prime9

Bhatti Vikramarka: ప్రజా భవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గృహప్రవేశం

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబసమేతంగా గురువారం తెల్లవారు జామున గృహప్రవేశం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాలతో ఆర్థిక, ఇంధన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించారు.

ఫైళ్లపై సంతకాలు..(Bhatti Vikramarka)

డిప్యూటీ సీఎంకి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాల్లో.. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్ల రూపాయలు ఆర్టీసీకి విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తొలి సంతకం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ 298 కోట్ల రూపాయలను వైద్య ఆరోగ్య శాఖకు విడుదల చేస్తూ రెండవ సంతకం చేశారు.విద్యుత్ సబ్సిడీ 996 కోట్ల రూపాయలు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల కొరకు 75 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఫైళ్లపై సంతకం చేశారు.

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రజాభవన్ కు గతంలో( ప్రగతి భవన్) లో ఏడేళ్లపాటు నివసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ పేరును జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా పేరు మార్చి అందులో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి మంత్రులు స్వయంగా వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

Exit mobile version