Site icon Prime9

Pawan Kalyan: వైసీపీ ఓటమి..కూటమి విజయం ఖాయం.. పవన్ కళ్యాణ్

Pawan Kalyan (GNV)

Pawan Kalyan (GNV)

Pawan Kalyan: వైసీపీ ఓటమి..కూటమి విజయం ఖాయమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో వారాహి విజయ భేరి సభలో సీఎం జగన్ పై పవన్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. యార్లగడ్డ వెంకట్రావు, బాలశౌరి ఆత్మగౌరం చంపుకోలేక వైసీపీ నుంచి బయటకు వచ్చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని పవన్ చెప్పారు.

మీ అందరి అభివృద్ధి కోసమే కూటమి..(Pawan Kalyan)

మీ అందరి అభివృద్ధి కోసమే కూటమిగా వచ్చామని పవన్ అన్నారు. మీ అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి. ఈ ప్రభుత్వం ఎవరికీ ఉద్యోగాలు లేకుండా చేసింది. రెండువేల రూపాయలకు మీరు లొంగిపోతే భవిష్యత్ ను పాడుచేసిన వారు అవుతారని పవన్ పేర్కొన్నారు. మద్యం ద్వారా జగన్ రూ.40 వేల కోట్లు సంపాదించారని, భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారని ఆరోపించారు. గన్నవరంలో ఐటీ కారిడార్ పెట్టాలని కోరుతున్నారు. జాతీయ రహదారికి అండర్ పాస్ లు కావాలంటున్నారు. వీటన్నింటికోసం బాలశౌరిని గెలిపించండి. వీటిని కేంద్ర ప్రభుత్వంతో మాట్టాడి నేను పూర్తి చేయిస్తాను అంటూ పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ అభ్యర్ది వంశీకి ఓటు వేస్తే మహిళలను కించపరిచేవారికి మద్దతిచ్చినట్లేనని పవన్ అన్నారు. ప్రజలను భయపెట్టేవారు కావాలా.. యార్లగడ్డ లాంటి సంస్కారవంతుడు కావాలా అనేది నిర్ణయించుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

వల్లభనేని వంశీ నీకే చెబుతున్న..! పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ | Pawan Kalyan Serious On Vallabaneni

 

Exit mobile version
Skip to toolbar