Site icon Prime9

Minister Roja : ఉత్తరాంధ్ర, రాయలసీమలకు అన్యాయం జరగకూడదనే వికేంద్రీకరణ.. మంత్రి రోజా

Roja

Roja

Minister Roja: చంద్రబాబు సైకిల్ చక్రాలు తుప్పుపట్టాయని.. టీడీపీ రాష్ట్రం కోసం చేసిందేమీ లేదని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మూడు రాజధానులకు మద్దతుగా నిర్వహించిన విశాఖ గర్జన ర్యాలీ‌లో రోజా పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు చేసిన వెధవ పనుల వల్ల, అత్యాశతో దోచుకుని దాచుకోవడం వల్ల.. మన ప్రాంతాలు అన్యాయం అయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగినట్టుగా ఒక్క అమరావతిలో అభివృద్ది జరిగితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్యాయం అయిపోతాయని అన్నారు. అందుకే సీఎం జగన్ పరిపాలన, వికేంద్రీకరణ అని.. మూడు రాజధానులకు శ్రీకారం చుట్టారని అన్నారు. పవన్ కల్యాణ్‌కు పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలని, పోటీ చేయడానికి గాజువాక కావాలని, నటన నేర్చుకోవడానికి, షూటింగ్‌లకు, సినిమా కలెక్షన్‌లకు కూడా వైజాగ్ కావాలని.. కానీ వైజాగ్‌కు పరిపాలన రాజధాని వద్దు అని అంటున్నారంటే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందడం ఆయనకు నచ్చదని రోజా అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు.. రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ప్రజల సపోర్టు ఉందని అన్నారు. 26 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని.. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందాలన్నారు. 26 జిల్లాల అభివృద్దిని 29 గ్రామాల్లో పెట్టేమనే వాళ్లు.. గజ్జి కుక్కలు, ఊర కుక్కలు, పిచ్చి కుక్కలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం చేస్తున్న పోరాటం.. రియల్ ఎస్టేట్ కోసం చేసేదని ఆరోపించారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రను ఎందుకు అభివృద్ది చేయలేదని రోజా ప్రశ్నించారు

మూడు రాజధానుల నినాదంతో అధికార వైసీపీ , నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన విశాఖ గర్జన ర్యాలీ ముగిసింది. అమరావతి రైతుల పాదయాత్రకు కౌంటర్ గా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మన విశాఖ – మన రాజధాని అనే నినాదంతో భారీ బహిరంగ సభ లో వైసీపీ దూకుడు పెంచింది. రాష్టం లో మూడు ప్రాంతాలు బాగుండాలని అదే ప్రజలు కోరుకుంటున్నారని వైసీపీ మంత్రులు వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణకు మద్దతుగా పెద్దఎత్తున ఉత్స్తాహంగా ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, రజిని, ముత్యాల నాయుడు, అమర్నాథ్, స్పీకర్ సీతారాం, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ నేపథ్యంలో నగరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.ఎల్‌ఐసీ భవనం సమీపంలోని డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం నుంచి విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభమైంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన నాయకులు.. గర్జన ర్యాలీని ప్రారంభించారు. బీచ్‌ రోడ్డులోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విశాఖ గర్జన ర్యాలీ సాగింది. అక్కడ నాయకులు వైస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు.

Exit mobile version