Site icon Prime9

Hyderabad Crime Rate:హైదరాబాదులో 2 శాతం పెరిగిన క్రైం రేట్

Hyderabad Crime Rate

Hyderabad Crime Rate

Hyderabad Crime Rate: హైదరాబాద్ సీపీ శ్రీనివాస రెడ్డి ఈ ఏడాది క్రైం వార్షిక నివేదికను విడుదల చేశారు. గతంతో పోల్చితో హైదరాబాదులో 2 శాతం క్రైం రేట్ పెరిగిందని తెలిపారు. ఈ ఏడాది 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందని.. గతేడాదితో పోల్చితే ఈ సారి చిన్నారులపై 12 శాతం కేసులు తగ్గాయని వివరించారు.

మర్డర్ కేసుల సంఖ్య తగ్గింది..(Hyderabad Crime Rate)

ఈ ఏడాది 63 శాతం మంది నేరస్తులకు శిక్షలు పడ్డాయని 9 శాతం దోపిడీలు పెరిగాయన్నారు. మర్డర్ కేసుల సంఖ్య బాగా తగ్గిందని వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేకంగా నార్కోటిక్ వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది జరిగిన అన్ని పండగలను ప్రశాంతంగా నిర్వహించుకున్నామని తెలిపారు.నగరంలో క్రైమ్‌ రేట్‌ను అరికట్టేందుకు కొత్త పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడంలో డిపార్ట్‌మెంట్ విజయం సాధించిందని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాగే నేరాల నిరోధం మరియు గుర్తింపు కోసం కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు.2023లో మొత్తం కేసులు 24,821 నమోదయ్యాయి, గత సంవత్సరాల్లో 21,795 కేసులు నమోదయ్యాయి.శారీరక వేధింపులకేసులు 16 శాతం పెరిగాయని, ఎన్నికలే ఇందుకు కారణమని హైదరాబాద్ సీపీ తెలిపారు. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ 38 కోట్ల రూపాయలు కాగా పోయిన సొమ్ములో 75 శాతం రికవరీ చేసారు. 2637 రోడ్డు ప్రమాదాలు, 4909 చీటింగ్ కేసులు, 262 హత్యా యత్నాలు, 91 చోరీలు, 79 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో పబ్బులు, ఈవెంట్స్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఎక్కడైనా డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేసినా తగిన చర్యలు తప్పవన్నారు.

Exit mobile version