CM Revanth Reddy Comments: పీవీ, జైపాల్ రెడ్డి లపై సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. దేశకీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని రేవంత్ అన్నారు.

  • Written By:
  • Publish Date - December 23, 2023 / 01:36 PM IST

CM Revanth Reddy Comments:మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద సీఎం రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. దేశకీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప మేధావి పీవీ నరసింహారావు అని రేవంత్ అన్నారు.

పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పీవీ అని కొనియాడారు. దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రశ్నార్ధకంగా మారినప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. బంగారాన్ని కుదవ పెట్టి అప్పులు తేవడంపై ఆయన ఒకే మాట చెప్పారు.. తెలివైన వాడు సగం ఆస్తిని కుదవపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని పీవీ చెప్పారనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

లంకె బిందెల్లాంటి వారు..(CM Revanth Reddy Comments)

భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి పీవీ అని రేవంత్ రెడ్డి అన్నారు.పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారు.పీవీ మన మధ్య లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమన్నారు.పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్ లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటి వారని చెప్పారు.పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు.