Site icon Prime9

CM Revanth Reddy: మెట్రో,ఫార్మాసిటీలను రద్దు చేయం.. స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: మెట్రో,ఫార్మాసిటీలను రద్దు చేయడంలేదని అయితే ప్రజాప్రయోజనాలకోసం స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సందర్బంగా    ఈ విషయాలను వెల్లడించారు.

మెట్రో దూరం తగ్గిస్తాం..(CM Revanth Reddy)

శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరం తగ్గిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం పేర్కొన్నారు. నాగోల్‌నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణ గుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కి లింక్ చేయనున్నట్లు చెప్పారు. బీహెచ్‌ఈఎల్‌‌నుంచి విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. అవసరమైతే మియాపూర్‌నుంచి రామచంద్రాపురం, మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని రేవంత్ వివరించారు. . తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే పూర్తవుతాయని సీఎం తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు.

ఫార్మాసిటీ, రింగ్ రోడ్, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య జీరో కాలుష్యంతో ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. ప్రత్యేక క్లస్టర్లవద్ద పరిశ్రమల్లో పనిచేసే వారికి ఇళ్లని నిర్మించి ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్మికులు హైదరాబాద్‌ వరకు రాకుండా అక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని, ఈ నైపుణ్యాలకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని సీఎం వివరించారు.

Exit mobile version
Skip to toolbar