Site icon Prime9

Revanth Reddy : తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయింది.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి విమర్శించారు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నా.. వారి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయింది. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయింది. ఈసీకి కేసీఆర్‌ లేఖ రాసిన అడ్రసులోనూ ఏపీగా పేర్కొనడం జరిగింది. 2 రాష్ట్రాలను కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్‌, కేటీఆర్‌ ఖండించలేదు. అంటే సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌ సంపూర్ణ మద్దతిస్తున్నట్టుగానే ఉంది. సజ్జల మాట్లాడి 24గంటలు గడవకముందే ఎన్నికల సంఘం లేఖలో అడ్రస్ ఏపీగా పేర్కొన్నారు. యధాలాపంగా జరిగింది కాదు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా కేసీఆర్ అంగీకరించడంలేదు. ఇది పక్కా ప్రణాళికతో జరిగింది. ఇది ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహం. ఇది నిజంగా తెలంగాణ సమాజానికి బ్లాక్ డే అని రేవంత్ రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్ గులాబీ కూలీకి సంబంధించిన అంశంపై తాను ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా చెప్పారు.ఈ పిటిషన్ పై ఈ నెల 12న విచారణ జరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ హైకోర్టులో కేసు ఉన్న విషయాన్ని ఈసీకి చెప్పినా పట్టించుకోలేదన్నారు. టీఆర్ఎస్ పేరును మార్చడం కోర్ఠు ధిక్కారం కిందకు వస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ విషయమై ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Exit mobile version