Site icon Prime9

CM KCR: కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, కన్నీళ్లు తప్పవు.. సీఎం కేసీఆర్

CM KCR

CM KCR

 CM KCR:  గద్వాల చరిత్ర చాలా గొప్పదని అటువంటి గద్వాలను గబ్బు పట్టించిందెవరో ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం గద్వాల లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరువుతో అల్లాడామని అన్నారు.కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు, కన్నీళ్లు తప్పవని అన్నారు.

నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలను ముంచారు..( CM KCR)

గద్వాల ప్రాంతంలో వాల్మీకి బోయలు ఎక్కువగా ఉంటారని వారు ఏపీలో ఎస్టీలని, ఇక్కడ మాత్రం బీసీలుగా ఉన్నారని అన్నారు. తాను వారిని ఇక్కడ కూడా ఎస్టీల్లో పెట్టాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపించానని అయనా ఫలితం లేదన్నారు.మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలను ముంచారని అన్నారు. పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టామని ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ను చీల్చే ప్రయత్నం చేసారని అన్నారు. 14 ఏళ్ల ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ, అభ్యర్థి చరిత్ర చూసి ఓటేయాలని కోరారు.అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ ఇవ్వలేదు.కాంగ్రెస్ పార్టీ రైతుబంధు దుబారా అంటోంది. రాహుల్ గాంధీకి వ్యవసాయం గురించి తెలుసా? 3 గంటల కరెంట్ కావాలా? 24 గంటల కరెంట్ కావాలా? అంటే కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటోంది. ధరణి తీసేస్తే మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని కేసీఆర్ అన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్దికోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ది కృష్ణమోహన్ ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 

కాంగ్రెస్ వస్తే కటిక చీకటే | CM KCR | Praja Ashirvada Sabha At Gadwal |  Prime9 News

Exit mobile version
Skip to toolbar