Site icon Prime9

Bandi Sanjay Comments: సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారు..ఎంపీ బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Comments: ముఖ్యమంత్రి కేసిఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని, ఇతర పార్టీల నేతలనే కాకుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

గణేష్ మండపాలకు కోట్లాదిరూపాయలు..(Bandi Sanjay Comments)

పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా కరీంనగర్‌లో మొక్కలు నాటి, ఎన్నికల ప్రచార రథం ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేసిఆర్ గణేష్ మండపాలకు తాయిలాల పేరుతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3కోట్ల రూపాయలు ఇస్తూ యువతను బీఆర్ఎస్ వైపు ఆకర్షించేందుకు కుట్ర చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌నుండి గెలిచే వాళ్లంతా కేసీఆర్ కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్ లోకి తీసుకోవడం ఖాయమన్నారు.మేం కూడా దేవుడిని నమ్ముకున్నాం. ఆ దేవుడు సీఎం కేసిఆర్‌కి తగిన బుద్ధి చెబుతాడని బండి సంజయ్ అన్నారు.

 

Exit mobile version