CM Jagan Stone Pelting Case:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ కి జిల్లా కోర్టు ఎట్టికేలకు బెయిల్ మంజూరు చేసింది. కోర్ట్ కొన్ని షరతులు విధించింది. పోలీస్ విచారణకు సతీష్ సహకరించాలని ఆదేశించింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై అతని న్యాయవాది సలీం వాదనలు వినిపించారు . సతీష్ కుమార్ నిరపరాది, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారని వాధించారు. మరో వైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలనే సతీష్ సీఎం జగన్ పై దాడి చేశారని వాదించారు .
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశాడు. సింగ్ నగర్ లో ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన రాయి సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది . సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం అయింది . రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయింది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎడమ కంటికి సైతం గాయం అయింది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్రను సీఎం జగన్ కొనసాగించారు . ఈ కేసును దర్యప్తు చేసిన పోలీసులు సతీష్ అనే యువకుడు దాడికి పాల్పడ్డట్లు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు.అప్పటి నుంచి సతీష్ రిమాండ్ లో వున్నాడు .