Site icon Prime9

CM jagan: మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. సీఎం జగన్

cm jagan

cm jagan

CM jagan: ఏపీలో సార్వత్రిక ఎన్నికల ముగిసిన మూడు రోజులకు ముఖ్యమంత్రి జగన్ బయటకి వచ్చి మాట్లాడారు . గురువారం మధ్యాహ్నాం ఐప్యాక్‌ ప్రతినిధులతో భేటీ అయిన సీఎం జగన్‌ ఎన్నికల ఫలితాల్ని విశ్లేషణ చేసి అంచనా వేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని అన్నారు.

ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్..(CM jagan)

మళ్లీ అధికారంలోకి వస్తున్నామని , మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం అన్నారు.జూన్‌4వ తేదీన రాబోయే ఏపీ ఫలితాలు చూసి యావత్తు దేశం షాక్‌ అవుతుందన్నారు . ఫలితాల తర్వాత దేశం మొత్తం మనవైపే చూస్తుంది. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచాం. ఈసారి గతంలో కంటే ఎక్కువ ట్లే గెలుస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ,గత ఎన్నికల్లో వైసీపీకి సలహాలు అందించిన ప్రశాంత్‌ కిషోర్‌ పై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేసారు .ఎప్పుడైనా ప్రశాంత్‌ కిషోర్‌ చేసేది ఏమీ లేదు. అంతా ఐప్యాక్‌ టీమే చేస్తుందన్నారు . వచ్చే ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేద్దామని తెలిపారు . అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఐప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ అన్నారు.ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం పొలిటికల్‌ కన్సల్టెన్సీగా ఐప్యాక్‌ పని చేసిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నాం జగన్ స్వయంగా విజయవాడ లోని ఐప్యాక్‌ కార్యాలయానికి వెళ్లిన సీఎం జగన్‌ అక్కడి ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐ-ప్యాక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ టీం సభ్యులతో సెల్ఫీలు దిగుతూ కాసేపు సరదాగా గడిపారు.

2019 కంటే భారీ మెజారిటీతో గెలుపు ఖాయం..! | CM Jagan Meets IPAC Team | Prime9 News

Exit mobile version
Skip to toolbar