CM Jagan Comments:ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చార్యాన్ని కలిగించాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎంతో చేసినా వారి ప్రేమలు ఏమయ్యాయో తెలియలేదన్నారు. ఏపీ ప్రజలకోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డాం.66 లక్షలమంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు ఫించన్లు ఇచ్చాం. కోటి ఐదు లక్షలమంది పొదుపు సంఘాల అక్కా చెల్లెళ్లకు సాయం చేసాము. వారి ప్రేమలు ఏ మయ్యాయో తెలియదన్నారు.
పిల్లల చదువులకోసం ఏ తల్లి తండ్రి ఇబ్బందిపడకూడదని పూర్తి ఫీజులు ఇచ్చాం. చదువులో ఎప్పుడూ చూడని మార్పులు తెచ్చాం. ఎన్ని మంచి పనులు చేసినా అప్యాయత ఏమైందో తెలియదు. రైతు సోదరులకు పంట పెట్టుబడి, ఉచిత ఇన్సూరెన్స్, పగటి పూట 9 గంటల కరెంటు ఇచ్చినా అరకోటి మంది రైతుల అప్యాయత ఏమైందో తెలియలేదు. నేతన్నలు, మత్స్యకారులు అన్ని వర్గాలకు మంచి పనులు చేసాము. అమ్మ ఒడితో కోటి 53 లక్షలమందికి మంచి చేసాం. గ్రామ సచివాలయ వ్యవస్ద, వాలంటీర్ వ్యవస్దతో ప్రజల ఇళ్లకే సేవలందించాము. ఇన్ని కోట్ల మందికి మంచి చేసాక వారి ప్రేమను పొందలేకపోయామని జగన్ అన్నారు.
ఏపీలో విజయం సాధంచిన కూటమి పెద్దోళ్ల కూటమి.. ఢిల్లీలో ఇన్స్ ఫ్లుయెన్స్ చేయగలిగే కూటమి. ఈ కూటమిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉండటం తనకు కొత్త ఏమీ కాదన్నారు. తన రాజకీయ జీవితంలో ఎక్కువకాలం ప్రతిపక్షంలోనే ఉన్నామని చెప్పారు. తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురయినా వాటిని ఎదుర్కొంటామని ప్రజల తరపున పోరాడతామని చెప్పారు.