CM Chandrababu in Kolanukonda: ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్లారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్వహించారు.. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని చెప్పారు. తిరుమల వెంకన్న తనకు ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. కాళ్లకు దండంపెట్టే సంస్కృతి వీడాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే నేను వారి కాళ్లకు దండం పెడుతానని చంద్రబాబు అన్నారు. ఇవాళ్టీ నుంచి కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానని చెప్పారు. తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప.. నాయకులకు కాదన్నారు. నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవ్వరూ తమ గౌరవాన్ని తగించుకోవద్దని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు.. దండం పెట్టకూడదనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.