Site icon Prime9

CM Chandrababu on Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు జగన్ శాపంగా మారారు.. సీఎం చంద్రబాబు నాయుడు

Chandrababu on Polavaram

Chandrababu on Polavaram

CM Chandrababu on Polavaram Project: పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిని చూసి కుంగిపోయానన్నారు. ప్రజలందరికీ రక్షగా ఉండే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు జగన్ శాపమని పేర్కొన్నారు.

జగన్ నిర్వాకం వల్లే..(CM Chandrababu on Polavaram Project)

టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, జగన్ హయాంలో 3.84 శాతం పనులు మాత్రమే జరిగాయని చంద్రబాబు అన్నారు. వీటిని జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు 3,385 కోట్ల నిధులు కేటాయించారు. ‘వీటిని జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. వైసీపీ పాలనలో ఐఐటీ, పీపీఏ నిపుణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం రూ. ఈ ప్రాజెక్టుపై 11,762 కోట్లు ఖర్చు చేయగా, జగన్ ప్రభుత్వ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో రైతాంగానికి జీవనాడి అవుతుందని ఉద్ఘాటించారు. ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా రైతులు రూ. 45,000 కోట్లు నష్టపోయారని ఆయన చెప్పారు . కాంట్రాక్టర్లను మార్చడం, సమర్థులైన అధికారులను బదిలీ చేయడం వల్ల పోలవరానికి ఈ పరిస్దతి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ నిర్వాకం వల్లే ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 2018లో రూ 436 కోట్లు .కోట్లు వెచ్చించి డయాఫ్రమ్‌వాల్‌ను పూర్తి చేసిందని ఆయన చెప్పారు. ఇపుడు దాని మరమ్మతులకు దాదాపు రూ. 447 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. కొత్త గోడ నిర్మాణానికి సుమారు రూ. 990 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. ఏమైనా జాతీయ, అంతర్జాతీయ నిపుణుల సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

పోలవరం పై జగన్ చేసిన తప్పు బయటపెట్టిన చంద్రబాబు | Chandrababu Clarity About Polavaram | Prime9 News

Exit mobile version
Skip to toolbar