CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు పోలవరం చేరుకున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. పోలవరం చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ నేతల ఘన స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్టర్లతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. .గతంలో అయన సీఎం గా వున్నప్పుడు ప్రతి సోమవారం పోలవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు ను సందర్శించి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించే వారు.
ప్రతి సోమవారం సమీక్ష.. (CM Chandrababu Naidu)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా తొలిసారి పోలవరం చేరుకున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సోమవారం పోలవరంను ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన, జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.