Site icon Prime9

CM Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన.. ఈ నెలలోనే మెగా డీఎస్సీ పోస్టుల భర్తీ

CM Chandrababu Key Comments About Mega DSC: ఏప్రిల్‌లోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలంలో కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తిచేస్తామని తెలిపారు.

 

2027 నాటికి పోలవరాన్ని సైతం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు. ముఖ్యంగా సంకల్పం ఉందని, కష్టపడే తత్వం ఉందన్నారు. రేపు ఏం చేయాలో ఇవాళే ఆలోచన చేస్తానని చెప్పారు. సంపద సృష్టించి పేదలకు ఖర్చు చేస్తానని, సమర్థవంతంగా పాలన చేస్తే దేనినైనా బాగు చేయొచ్చు అన్నారు.

 

గతంలో రోడ్లు అన్నీ గుంతలేనని, ఇప్పుడు రోడ్లు బాగున్నాయా? లేదా? అని ప్రజలను అడిగారు. ప్రజలు ముందు అని, ఆ తర్వాతే మిగతా పనులని చంద్రబాబు తెలిపారు. కొన్నిచోట్ల ముందు ఉంది నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని చెప్పారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

 

రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటున్నట్లు ఇప్పటికే చెప్పానని, అందులో భాగంగానే ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దివాళా తీయించారని, ఇప్పుడిప్పుడే గాడిన పెట్టామని వివరించారు. అప్పు చేసైనా చేసి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని, కేంద్రం అందించే రూ.6వేలకు 14వేలు కలిపి ఇస్తామన్నారు.

Exit mobile version
Skip to toolbar