Hyderabad: హైదరాబాద్ మధురానగర్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. రహ్మత్ నగర్‌లోని బంగారు మైసమ్మగుడివద్ద ఉంటున్న శ్రీనాథ్.. పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. అయితే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉన్న ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో అదును చూసుకొని రోడ్డుపై వెళ్తున్న శ్రీనాథ్‌పై ధనుంజయ్, అతని స్నేహితులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. అడ్డొచ్చిన భార్యపై కూడా దాడి చేశారు.
చికిత్స కోసం తరలింపు..(Hyderabad)
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దంపతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుక్కను వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన వారిపై సెక్షన్లు 147, 148, జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టంలోని సెక్షన్ 11(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.