Chegondi Harirama Jogaiah: ఏపీ సిఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాపుల విరోధి అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. వైసిపి సర్కార్ కాపు వ్యతిరేక విధానం చూస్తుంటే కాపులకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని అర్థమైపోతోందని జోగయ్య చెప్పారు.
కాపుల రిజర్వేషన్ కు టీడీపీ అనుకూలం..( Chegondi Harirama Jogaiah)
కాపుల రిజర్వేషన్‌పట్ల తెలుగుదేశమే కొంత అనుకూలంగా ఉందని జోగయ్య విశ్లేషించారు. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబే పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రకటన చేసిన నారా లోకేష్ కాపులని అయోమయంలోకి నెట్టి వారి కోపతాపాలకి కారణమయ్యారని జోగయ్య వివరించారు. ఇలా కాకుండా రిజర్వేషన్స్ విషయంలో కాపులపట్ల టీడీపీ చూపించిన సానుకూలతే చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల చూపించి గౌరవ ప్రదమైన ఉన్నతపదవిని అధిష్టించడంలో కనబరచాలని జోగయ్య సలహా ఇచ్చారు. అప్పుడే జనసేన- టీడీపీ సఖ్యత సంవత్సరాల తరబడి మూడు పువ్వులు- ఆరుకాయలుగా ఉంటుందని జోగయ్య అంచనా వేశారు.