Site icon Prime9

Hari Rama Jogaiah: ప్రజా చార్జ్ షీట్ ను విడుదల చేసిన చేగొండి హరి రామ జోగయ్య

senior politician Harirama Jogaiah letter to cm ys jagan

senior politician Harirama Jogaiah letter to cm ys jagan

Hari Rama Jogaiah: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై 55 అభియోగాలతో కూడిన ప్రజా చార్జ్ షీట్ ను కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య విడుదల చేశారు. జగన్ ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించాలా? వద్దా? అని ఛార్జ్ షీట్ ద్వారా ప్రజలను ప్రశ్నించారు. జోగయ్య. అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ ఛార్జ్ షీట్ ని విడుదల చేశారు. సత్యం జయించాలనే అభిలాషతో ఈ ప్రజా చార్జ్ షీటుని ప్రజాకోర్టులో ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. జోగయ్య తాజాగా విడుదల చేసిన ప్రజా ఛార్జ్ షీట్ లో జగన్ సర్కారుపై చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

క్విడ్ ప్రోకో తో కోట్లాదిరూపాయలు..(Hari Rama Jogaiah)

జోగయ్య విడుదల చేసిన ప్రజా ఛార్జ్ షీట్ లో అనేక విషయాలను ప్రస్తావించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని పలువురు పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలను సమకూర్చి , వాటికి ఫలితంగా క్విడ్ ప్రోకో అనే విధానానికి నాంది పలికి, జగన్ మోహన్ రెడ్డి కోట్లాది రూపాయిలు ఆర్జించారని ఆరోపించారు . సీబీఐ, ఈడీ డిపార్టుమెంట్ల అధికారులు విచారణ జరిపిన తరువాత – తెలంగాణ సీబీఐ కోర్టులో 11 CBI కేసులు, 7 ఈడీ కేసులు పెట్టిందన్నారు. ఈ సందర్భంలో జగన్ 16 నెలలు జైలులో ఉండి బెయిల్ పై విడుదల అయ్యారని , అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ముతో బెంగుళూరు, హైదరాబాద్, తాడేపల్లిలో విలాసవంతమైన నివాస భవనాలు కట్టారని , 2019 ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి అయ్యారని, ఇలాంటి అవినీతి చక్రవర్తిని మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు జోగయ్య.

కోర్టులు తప్పు పట్టాయి..

ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని వందల నిర్ణయాలను కోర్టులు తప్పు పట్టాయంటే జగన్ పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. కాబట్టి, జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన మోసాలను, అరాచకాలను, అవినీతిని చెబుతూ ప్రజల తరపున తానూ జన ఛార్జిషీట్‌ను తయారు చేసి , ప్రజా కోర్టులో ప్రవేశపెడుతున్నానన్నారు. ఈ ఛార్జిషీట్‌లో జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజా వ్యతిరేక పాలనను పరిశీలించి , వచ్చే ఎన్నికలలో ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ మోహన్ రెడ్డిని తొలుత ఇంటికి, ఆ తర్వాత జైలుకు పంపాలనే ప్రతిపాదనను పరిశీలించాలని జోగయ్య పిలుపునిచ్చారు. నీతివంతమైన, ప్రజాహిత పరిపాలన అందించగల జన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుతూ ముగించారు జోగయ్య.

Exit mobile version