Charminar Express : హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్‌లోనే చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ సైడ్ వాల్‌ను ఈ రైలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకునే క్రమంలో.. రైలు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
రైల్వే ఆస్పత్రిలో చికిత్స..(Charminar Express)
స్టేషన్‌లోని డెడ్ ఎండ్ గోడను రైలు ఢీకొట్టినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఇదే చివరి స్టేషన్ కావడంతో ప్రమాదం తప్పిందని.. ఘటన కంటే ముందే చాలా మంది ప్రయాణికులు దిగిపోయారని ప్రకటించింది. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మొత్తం మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను లాలాగూడలోని రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్టేషన్‌లోనే పట్టాలు తప్పడంతో రైలులోని ప్రయాణికులతో పాటు ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వారు కూడా భయంతో పరుగులు చేశారు. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు.