Site icon Prime9

Undavalli Arun Kumar: సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు మార్చడం ఈజీ కాదు.. ఉండవల్లి అరుణ్ కుమార్

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar

Undavalli Arun Kumar: అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి చెప్పారు.

ఎమ్మెల్యేలకు పవర్ ఎక్కడుంది ? (Undavalli Arun Kumar)

నాడు జగన్ బాధ పడ్డట్టు గానే ఇప్పుడు సీట్ల మార్పు విషయంలో ఎమ్మెల్యేల ఫీలింగ్ ఉందని ఉండవల్లి అన్నారు. అసలు వైసిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి అధికారం ఎక్కడుందని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్‌కి వాలంటీర్లకి మధ్యన ఎపి ప్రభుత్వం నడుస్తోందని ఉండవల్లి వివరించారు. తెలంగాణలో అభ్యర్థుల్ని మార్చక కేసీఆర్, ఏపీలో అభ్యర్థుల్ని మార్చి వైఎస్ జగన్ ఓడిపోయారన్న అపప్రధ రాకుండా చూసుకోవాలని ఉండవల్లి సూచించారు.అప్పులు చేసి సంక్షేమపధకాలు ఇవ్వడం అనేది కొత్త విషయమని అన్నారు.ఏపీలో చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కలవడం ప్రతిపక్షానికి బలం అవుతుందన్నారు. దివంగత వైఎస్సార్ కు జవహర్ లాల్ నెహ్రూ అంటే చాలా అభిమానమని అన్నారు. వైసీపీ ఎంపీ రాజ్యసభలో నెహ్రూని విమర్శించిన తీరు చూసి బీజేపీ నేతలయిన అమిత్ షా తదితరులు ఆనందపడితే తాను షాకయ్యానని ఉండవల్లి అన్నారు. బీజేపీ నేతలకు నచ్చినట్లు నడుద్దాం అనుకుంటే అది వైసీపీకి ప్లస్ అవదని మైనస్ అవుతుందని ఉండవల్లి చెప్పారు.

Undavalli Arun Kumar Comments On Jagan New Decision Over MLA Candidates | Prime9 News

Exit mobile version
Skip to toolbar