Chandrababu Swearing-in Ceremony: ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడింది .ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీప్రమాణ స్వీకారం చేసారు .మంత్రులుగా వరుసగా కొణిదెల పవన్ కళ్యాణ్ ,నారా లోకేష్ ,అచ్చెన్నాయుడు ,కోళ్లు రవీంద్ర ,నాదెండ్ల మనోహర్ ,పొంగూరు నారాయణ ,వంగల పూడి అనిత,సత్య కుమార్ యాదవ్ ,నిమ్మల రామా నాయుడు ,ఎన్ ఎం డి ఫరూక్ ,ఆనం రామ నారాయణ రెడ్డి ,పయ్యావుల కేశవ్ ,అనగాని సత్య ప్రసాద్ ,కొలుసు పార్ధ సారధి ,డోలా బాల వీరాంజినేయ స్వామి ,గొట్టి పాటి రవి కుమార్ ,కందుల దుర్గేష్ ,గుమ్మడి సంధ్య రాణి ,బిసి జనార్దన్ రెడ్డి , టీజీ భరత్ ,సంజీవ రెడ్డి గారి సవిత ,వాసం శెట్టి సుభాష్ ,కొండపల్లి శ్రీనివాస్ ,మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు ప్రమాణస్వీకారం చేసారు.
తడబడిన మంత్రులు..(Chandrababu Swearing-in Ceremony)
అంతఃకరణ శుద్ధి అనే మాటను పలకడంలో లోకేష్ కొంత తడపడ్డారు.ఎన్ ఎం డి ఫరూక్ అల్లా సాక్షిగా ప్రమాణం చేసారు .కొంత తడపడడం జరిగింది ,కొన్ని పదాలు పలకడంలో బీసీ జనార్దన్ రెడ్డి కూడా కొంత తడపడ్డారు .సార్వభౌమాధి కరం అనే పదం పలకడంలో సంజీవ రెడ్డి గారి సవిత తడపడ్డారు , టీజీ భరత్ ఇంగ్లీష్ లో ప్రమాణం చేసారు .వాసం శెట్టి సుభాష్ చాలా పదాలు పలకడంలో తడపడ్డారు .కొండపల్లి శ్రీనివాస్ కూడా కొంత తడపడ్డారు .అంతఃకరణ శుద్ధి అనే మాటను పలకడంలో మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి తడబడ్డారు .ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ తో సహా కేంద్రమంత్రులు అమిత్ షా ,నడ్డా ,గడ్కరీ హాజరయ్యారు .