Chandrababu Naidu: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టైన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనితో టిడిపి కార్యకర్తలు ఆందోళనకి దిగే అవకాశాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్తగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ థర్టీని అమలు చేస్తున్నారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని ఎస్పీ జగదీష్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్ధరాత్రినుంచి అమల్లోకి వచ్చిన ఈ సెక్షన్ థర్టీ ఈ నెల 30వ తేదీ వరకూ అమల్లో ఉంటాయి. దీంతోపాటు సెక్షన్ 144ని అమలు చేస్తున్నారు.
అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్..( Chandrababu Naidu)
ఇక జైలు జీవితం గడుపుతున్న చంద్రబాబు నాయుడు ఈ ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్, బ్లాక్ టీ తీసుకున్నారు. సొంతింటి ఆహారం తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమంతిచండంతో ఆయన పిఎ మాణిక్యం బయటనుంచి అల్పాహారం తీసుకు వచ్చారు. మధ్యాహ్నం కూడా పిఎం మాణిక్యమే ఆహారం తీసుకు వెళ్ళనున్నారు. చంద్రబాబుకి అవసరమైన ఆహారం తయారు చేసేందుకు రాజమండ్రిలోని ఓ ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి ఇవాళ జైల్లో చంద్రబాబుని కలువనున్నారు. చంద్రబాబుకు అండర్ ట్రయల్ ఖైదీ గా 7691 నంబరు కేటాయించారు.