Site icon Prime9

AP Poll Violence: ఏపీలో ఎన్నికల సందర్బంగా హింసపై సీఈసీ కఠిన చర్యలు

Poll Violence

Poll Violence

AP Poll Violence: ఏపీలో ఎన్నికల సందర్భంగా ,ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.పల్నాడు, తిరుపతి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే . ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనట్టు నివేదిక అందిందని ఈసీ వెల్లడించింది. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు.

కలెక్టర్లు, ఎస్పీలపై వేటు..(AP Poll Violence)

ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది.

శాఖారపరమైన విచారణ..

మరో వైపు పల్నాడు, అనంతపురం, తిరుపతి మూడు జిల్లాలో 12 మంది సీఐ, ఎస్సై స్థాయి అధికారులు పై శాఖపరమైన విచారణకు ఆదేశించింది . స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ చేత వీరందరిపై విచారణ జరిపించి రెండు రోజులలో వారిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ ఆదేశించింది. ఈ దాడులకు పాల్పడిన వారందరిపై సంబందిత సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి ఆ వివరాలను కూడా సమర్పించాలని ఆదేశించింది. జూన్ 4న ఫలితాలు వెల్లడించిన తర్వాత కూడా రాష్ట్రంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని భావించిన ఎన్నికల సంఘం జూన్ 19వరకు రాష్ట్రంలో 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించి ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్ల పై అధికార పక్షం ,ప్రతిపక్షాలు ఒకరి పై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు .ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసారు .

Exit mobile version