Site icon Prime9

FIR on YS Jagan: ఆర్ఆర్ఆర్ రిటర్న్ గిఫ్ట్ ..వైఎస్ జగన్, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ పై కేసు నమోదు

jagan

jagan

FIR on YS Jagan: ఏపీలో ప్రభుత్వం మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ ఆర్ టైం వచ్చింది. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారు. వైసీపీ హాయంలో తనను టార్చర్ చేసిన వారిని వదిలిపెట్టనని అప్పుడు చెప్పారు. ఇప్పడు అదే దిశగా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. చేతిలో అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చు అనే విర్రవీగేవారికి తగిన బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యారు రఘురామ రాజు.

చంపేస్తామని బెదిరించారు.. (FIR on YS Jagan)

కస్టోడియల్‌ టార్చర్‌పై మాజీ ఎంపీ రఘురామ ఇచ్చిన ఫిర్యాదుపై మాజీ సిఎం జగన్‌తో పాటు మాజీ సిఐడి చీఫ్‌ పీవీ.సునీల్, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పిఎస్సార్‌లపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 2021లో రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో విద్వేషపూరిత ప్రసంగం, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్‌లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకోవడమే కాకుండా తీవ్రంగా కొట్టారని, తనపై హత్యయత్నం కూడా జరిగిందంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు రఘురామరాజు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

జగన్ ప్రభుత్వ హాయంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై గుంటూరు ఎస్పీ కి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగ్మోహన్ రెడ్డి, అప్పటి సీఐడీ, అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌లపై కేసు నమోదైంది. తనకు అయిన గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. జగన్ ను విమర్శిస్తే తనను చంపేస్తానని సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version