Vijayasai Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి పదవి పొందారని పురందేశ్వరిపై మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడైన చంద్రబాబుకోసం కొమ్ముకాస్తున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్ లో ధ్వజమెత్తారు.
మీ మరిదికి కొమ్ముకాస్తున్నారు..(Vijayasai Reddy)
ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి…ఎన్టీఆర్ వ్యతిరేక కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి, కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి, బీజేపీలో పదవి పొంది…టీడీపీ అధ్యక్షుడైన మీ మరిది కోసం. అది కూడా, తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టిన మీ మరిది కోసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొమ్ముకాస్తున్నారంటే…ఇన్ని రంగులు మార్చగల మీ నైపుణ్యాన్ని ఏమని పిలవాలి? అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు.
మరో ట్వీట్ లో పురంధేశ్వరి గారూ…మీరు టీడీపీలో ఎన్నాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ కు ఎందుకు వెళ్ళారో, కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో, ఇందులో ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారు. కనీసం బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారన్నదైనా చెప్పగలరా? అంటూ ప్రశ్నించారు.