BJP Bus Yatra: ఈ నెల 21నుంచి తెలంగాణ బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేయనున్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బస్సు యాత్రపై సమీక్ష నిర్వహించారు.
మూడు చోట్ల నుంచి బీజేపీ యాత్రలు..(BJP Bus Yatra)
బస్సు యాత్రకోసం మూడు రూట్లను బీజేపీ నేతలు సిద్ధం చేశారు. మూడు చోట్ల నుంచి బీజేపీ యాత్రలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణను బీజేపీ నేతలు మూడు జోన్లుగా విభజించారు. జోన్ వన్ లో అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉండగా.. బాసర నుంచి బస్సు యాత్ర పారంభించనున్నారు. రెండో జోన్లో మహబూబ్ నగర్ , నల్గొండ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్ లో సోమశిల నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మూడో జోన్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జోన్ లో భద్రాచలం నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. ఈ యాత్రలన్నీ హైదరాబాద్ లో ముగియనున్నాయి. బస్సు యాత్ర ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరుకాన్నున్నారు. మొత్తం 19 రోజుల్లో నాలుగు వేల కిలో మీటర్లు యాత్ర చేయనుంది బీజేపీ.
ఇలా ఉండగా అందరూ అనుకుంటున్నట్లుగా ఈ సారికి తెలంగాణలో జమిలి ఎన్నికలు లేనట్లేనని కిషన్ రెడ్డి చెప్పారు షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగవని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.