Prime9

BRS Meets Speaker: పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయండి.. స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు

BRS Meets Speaker: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌ల‌ు జరగకుండా చూడాలని స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిష‌న్లు స‌మ‌ర్పించారు. స్పీకర్ ను కలిసిన వారిలో హ‌రీశ్‌రావు, కేటీఆర్, స‌బితా ఇంద్రారెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డి, ప‌ద్మారావు గౌడ్ తదితరులు ఉన్నారు.

బెదిరించి చేర్చుకుంటున్నారు..(BRS Meets Speaker)

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోందని, ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు గురిచేసి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కొంతమంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారిని భయపెట్టేందుకు సంబంధిత శాఖలను ఉపయోగించి బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని, కాంగ్రెస్‌లో చేరితేనే బతుకుతారని పోలీసుల నుంచి హెచ్చరికలు అందాయని ఆయన పేర్కొన్నారు.బడే భాయ్ (ప్రధాని నరేంద్ర మోడీ) ప్రతిపక్ష నేతలను భయపెట్టడానికి ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించినట్లు, చోటే భాయ్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి) మా ఎమ్మెల్యేలను బెదిరించడానికి రాష్ట్ర ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar